Monday, 30 August 2021

టాలీవుడ్ లోకి మరో సినీ వారసురాలు ఎంట్రీ.. హీరోయిన్‌గా శ్రీకాంత్ డాటర్!

చిత్రసీమలోకి నటీనటుల వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే. ఆ నాటి నుంచి నేటివరకు ఎందరో స్టార్ కిడ్స్ సినీ గడప తొక్కారు. అయితే సక్సెస్ అనేది మాత్రం సదరు వ్యక్తి టాలెంట్‌పై ఆధారపడి ఉంటుందని చాలామంది స్టార్ కిడ్స్ విషయంలో ప్రూవ్ అయింది కూడా. ఈ నేపథ్యంలోనే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పటికే వెండితెర ఆరంగేట్రం చేయగా.. ఇప్పుడు కూతురు కూడా అదే బాట పట్టిందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి చాలా తక్కువ మంది హీరోలు తమ కూతుళ్లు సినీ ఎంట్రీ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్‌ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక ఫీమేల్ లీడ్స్ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో శ్రీకాంత్- ఊహ కూతురు మేధ కూడా చేరబోతోందని ఇన్ సైడ్ టాక్. 17 ఏళ్ల మేధను హీరోయిన్‌గా చేసేందుకు శ్రీకాంత్ దంపతులు ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఇందుకోసమే ప్రస్తుతం భరత నాట్యం శిక్షణ తీసుకుంటోందట మేధ. ఆమె ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్న శ్రీకాంత్- ఊహ దంపతులు అందుకోసం ఇప్పటికే కథల వేట ప్రారంభించారని తెలుస్తోంది. సరైన కథ, డైరెక్టర్ సెట్ అయితే అతిత్వరలో ఆమె కెమెరా ముందుకు రానుందని అంటున్నారు. ఇకపోతే శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ ‘నిర్మల కాన్వెంట్‌’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న 'పెళ్లి సందD' సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t0l0tr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...