Thursday, 26 August 2021

ఇచ్చట వాహనములు నిలుపరాదు

చిలసౌ, అల వైకుంఠపురములో సినిమాలతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుశాంత్. వరుస సక్సెస్‌ల మీదున్న ఇప్పుడు మరో ప్రయోగాన్ని చేశారు. ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటూ సరికొత్త కథాంశంతో ప్రేక్షకులు ముందుకు నేడు (ఆగస్ట్ 27) వచ్చారు. ఈ మూవీతో సుశాంత్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారో ఓ సారి చూద్దాం. దర్శకుడు తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ కథను అల్లినట్టు చెప్పుకొచ్చారు. తన స్నేహితుడికి జరిగిన ఘటనలే ఈ సినిమా నేపథ్యం అని, నో పార్కింగ్ అనే బోర్డ్, కాలనీలో జరిగిన సంఘటనలే ఈ సినిమాకు మూలం అని చిత్రయూనిట్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. దీనికి తగ్గట్టుగా సుశాంత్ సైతం సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఈ చిత్రంతో కొత్త సుశాంత్ కనిపించాడని మూవీ చూసిన అందరూ చెబుతున్నారని సుశాంత్ తెలిపారు. కమర్షియల్ అంశాలతో పాటు ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుందని సుశాంత్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సినిమా మీద భిన్న రకాల కామెంట్లతో మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. మరికాసేపట్లోనే పూర్తి రివ్యూ రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jjBHwM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...