Friday, 6 August 2021

ఆ విషయంలో ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వను! నా పేరెంట్స్‌కి అది నచ్చడం లేదు.. రష్మిక ఎమోషనల్

'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కిన కన్నడ నటి సూపర్ ఫామ్‌లో దూసుకుపోతోంది. రష్మిక ఎంటరైతే చాలు ఆ సినిమా సూపర్ హిట్ పక్కా అన్నట్లుగా ఉంది అమ్మడి క్రేజ్. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం షూటింగ్స్‌తో మళ్ళీ బిజీ అయ్యానని చెబుతున్న రష్మిక.. తానిలా వరుస షూటింగుల్లో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చడం లేదని అంటోంది. కరోనా ముప్పు పూర్తిగా తొలగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, కొన్నాళ్ల పాటు షూటింగ్‌లను వాయిదా వేసుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. పేరేంట్స్‌గా వాళ్లు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది కానీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాక వెళ్లక తప్పదు కదా అని ఆమె చెప్పుకొచ్చింది. సాధారణంగా తన వర్క్‌ విషయంలో ఎవ్వరికీ ఇన్‌వాల్వ్‌ అయ్యే ఛాన్స్ ఇవ్వనని అంటున్న రష్మిక.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రస్తుతం షూటింగుల్లో పాల్గొంటున్నానని తెలిపింది. ఈ బిజీ షెడ్యూల్‌ కారణంగా అమ్మానాన్నలు ఒకింత బాధపడుతున్నారు కానీ తప్పడం లేదంటూ రష్మిక ఎమోషనల్‌ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక మందన. ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా డిఫరెంట్ లుక్‌లో ఆమె కనిపించనుంది. దీంతో పాటు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37m3zd5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...