Saturday, 7 August 2021

నవ్వులు పూయించేందుకు మళ్లీ రెడీ అయిన సంజూ.. ‘బజార్ రౌడీ’ రిలీజ్ ఎప్పుడంటే..

సినిమాల్లో చేయాల్సిన దానికన్నా కాస్త ఎక్కువ చేస్తే అతి అంటూ ప్రేక్షకులు అసహ్యించుకుంటారు. కానీ, హీరో తీరు మాత్రం చాలా డిఫరెంట్.. తను ఎంత అతి చేస్తే ప్రేక్షకులు అంత నవ్వుకుంటారు. తొలి సినిమా హృదయ కాలేయంతోనే తెలుగు సినిమాలపై సెటైర్లు వేస్తూ.. ఆయన చేసిన సీన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాతో బర్నింగ్ స్టార్‌గా పాపులర్ అయ్యాడు సంపూ. అప్పటి నుంచి ఆయన సినిమాలు ఎప్పుడు విడుదలైన ఎంజాయ్ చేస్తూ చూస్తారు ప్రేక్షకులు. ఈ మధ్యే ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో శీలో రక్షతి రక్షితః అంటూ ఒంటిపై నూలు పోగు లేకుండా.. నగ్నంగా.. ఒంటినిండా గాయాలతో.. అసెంబ్లీ ఎదుట ‘క్యాలీఫ్లవర్’ని అక్కడ అడ్డుగా పెట్టుకుని షాక్ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. అయితే ఆయన నటిస్తున్న మరో చిత్ర ‘’. ఈ సినిమాలో ఓ రౌడీ పాత్రలో సంపూర్ణేస్ కనిపించనున్నాడు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాయాజీ షిండే, పృథ్వీ, నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మించారు. గతంలో రాజేంద్రప్రసాద్ సినిమాలకు ఎక్కువగా సంభాషణలు అందించిన మరుధూరి రాజా ఈ సినిమాకి మాటలు రాశారు. సంపూ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఇది రూపొందనుంది. ఇక ఈ నెల 20 తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా చూసే ప్రేక్షకులకు నవ్వుల విందు గ్యారెంటీ అని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s7ibXd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...