Monday, 2 August 2021

బండ్ల గణేష్ కొడుకు జిరాక్స్ కాపీ.. వైరల్ అవుతున్న జూ. బండ్ల, రంగంలోకి పవన్ ఫ్యాన్స్

ఇదేంటి మంచి రంగు మీద కనిపిస్తున్నాడు.. టీనేజ్‌లో నిగనిగలాడిపోతున్నాడు.. కళ్లకి కూలింగ్ గ్లాస్‌లు పెట్టుకుని ఎరుపు గీతల చొక్కలో భలే ఉన్నాడే అనేట్టుగా ఉన్న ఈ ఫొటోలో ఉన్నది బండ్ల గణేష్ కాదండోయ్.. ఆయన పెద్దబ్బాయి . సేమ్ టు సేమ్ బండ్ల గణేష్‌కి జిరాక్స్ కాపీలా ఉన్న హితేష్ బండ్ల ఫొటోలకు పోజులు కొడుతుండగా.. ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు బండ్ల గణేష్. అసలే బండ్ల గణేష్.. ఆపై పవన్ భక్తుడు.. ఇంకేముందు బండ్లవారబ్బాయి ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కామెంట్ల మోత మోగిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ‘జూనియర్ బండ్లని మన పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో ఫంక్షన్‌కి తీసుకుని రా అన్నా’ అని ఒకరంటే... ‘అయ్యో మీ అబ్బాయా?? మీ చిన్నప్పటి ఫొటో అనుకున్నామే’.. ‘జూనియర్ బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్.. తండ్రికి తగ్గ తనయుడు’.. ‘భలే ఉన్నాడు సార్.. ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా.. బండ్ల 2లా’.. ‘ఎక్కడకు పోద్దన్నా.. మీ బ్లాక్ బస్టర్ రాజసం.. తగ్గేదే లే బ్లాక్ బస్టర్ హితేష్ నాగన్’.. ఇలా తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. జూనియర్ బండ్ల వేసుకున్న షర్ట్.. సీనియర్ బండ్లది అట.. ఇంతకీ హీరోని చేస్తారా లేదా? బండ్లన్నా అంటే.. దేవుడు డిసైడ్ చేస్తాడు’ అంటూ రిప్లై ఇచ్చాడు బండ్ల గణేష్. మొత్తానికి బండ్ల గణేష్ తన కొడుకుని ఇలా ట్విట్టర్‌లో పరిచయం చేసి హాట్ టాపిక్ చేసేశారు. ఇటీవల ‘సిక్స్ సెన్స్’ కార్యక్రమానికి తన కూతుర్ని తీసుకుని వచ్చాడు బండ్ల గణేష్. ఇప్పుడు తన కొడుకు పరిచయం చేయడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V7reLV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...