Monday, 16 August 2021

చాలా రోజుల తరువాత పెళ్లికి.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా లేరు. సెకండ్ వేవ్ దెబ్బకు మొత్తానికి ఇంట్లోనే ఉండిపోయారు. షూటింగ్‌లు గట్రా వంటివేమీ పెట్టుకోకుండా ఇంటిపట్టునే ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి సాయమందించారు. స్వచ్చంద సంస్థలతో కలిసి రేణూ దేశాయ్ ఎంతో మంది ఆకలిని తీర్చారు. అలాంటి రేణూ దేశాయ్ కరోనా మరణాలను చూసి చలించిపోయారు. పరిస్థితులు కాస్త చక్కబడ్డ తరువాత సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయారు. సెకండ్ వేవ్ ప్రభావం చాలా గట్టిగా ఉండటం, బయటి పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఇంట్లోనే ఉండిపోయాను. బయట షూటింగ్‌లకు కూడా వెళ్లలేదు. ఎంతో భయంగా అనిపించింది. పైగా ఇంట్లో పిల్లలు ఉన్నారు. రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే డ్రామా జూనియర్స్ షోకు కూడా వెళ్లడం లేదు అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. అలాంటి రేణూ దేశాయ్ తాజాగా అడుగు బయటకు పెట్టారు. కావాల్సిన వారింట్లో పెళ్లి ఉండటంతో బయటకు వచ్చారట. ఈ మేరకు రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేశారు. చాలా రోజుల తరువాత ఇలా బయటకు వచ్చాను.. పెళ్లికి వచ్చాను.. ఇప్పుడు మాస్క్ ధరించడం జనజీవనంలో సాధారణంగా మారిపోయింది. ఇకపై మనం మాస్క్ లేకుండా నిజంగానే కంఫర్ట్‌గా ఉంటామా? అని ఆశ్చర్యం వేసింది అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. తన రైతు సినిమా గురించి మాట్లాడుతూ మళ్లీ వచ్చే వేసవి వరకు ఆగాల్సిందేనని, ఆ సమయంలోనే షూటింగ్ చేయాల్సి ఉంటుందని రేణూ దేశాయ్ లైవ్‌లో క్లారిటీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xQAbGC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...