Sunday, 1 August 2021

విడాకులకు రెడీ అయిన హీరోయిన్ సంజన.. కారణం ఏంటని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన హీరోయిన్ తాజాగా తన వైవాహిక జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుందట. పెళ్లి జరిగి కనీసం సంవత్సరం కూడా కాకుండానే తన భర్తతో విడాకులు తీసుకోవాలని ఆమె తీర్మానం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి స్ఫష్టమైన కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరావడం లేదు. తెలుగులో ‘బుజ్జిగాడు’ అనే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సంజనా. ఈ సినిమాలో ప్రభాస్, త్రిష, మోహన్ బాబు తదితరులతో కలిసి నటించిన ఆమె.. తన నటనతో మంచి గుర్తింపు సాధించింది. అయితే తెలుగులో ఆమెకు తగిన గుర్తింపు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైంది. అక్కడ పలు సినిమాల్లో మంచి సక్సెస్‌ను అందుకుంది. అయితే కొన్ని రోజుల క్రితం కన్నడ ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సంజన అడ్డంగా బుక్‌ అయింది. ఈ కేసులో ఆమె పాత్ర ఉందని తేలడంతో జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇవన్నీ పక్కనబెడితే.. సంజనా తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది చిన్ననాటి స్నేహితుడైన అజీజ్‌ పాషాను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆయనతో విడాకులు తీసుకొనేందుకు ఆమె సిద్ధంగా ఉందని సమాచారం తెలుస్తోంది. చిన్ననాటి నుంచి ఒకరికొకరు తెలిసినప్పటికీ.. పరస్పరంగా మనఃస్పర్ధలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని బయట టాక్. కానీ, వీళ్లు నిజంగానే విడిపోతున్నారా? ఒకవేళ విడిపోతే.. అందుకు కారణం ఎంటీ.. అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C4zn43
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...