Monday, 9 August 2021

‘దానికి సూపర్‌స్టార్ కటౌట్‌యే సాక్ష్యం’.. బావకు తన సినిమా స్టైల్‌లో విషెస్ చెప్పిన సుధీర్ బాబు

యంగ్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ హీరోయిన్ సోడాల శ్రీదేవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ ఆనంది ఈ పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా సూరిబాబు ఓ స్టార్ హీరో కటౌట్‌కి లైటింగ్ పెట్టారు. ఆయన మరెవరో కాదు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. వరుసకు , సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారు. మహేష్ సొదరిని సుధీర్ వివాహం చేసుకున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం మహేష్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌ తనదైన స్టైల్‌లో విషెస్ తెలిపారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో ఆయన లైట్స్ పెట్టేవాడిగా నటిస్తున్నారు. అయితే ‘సూరిబాబు లైటింగ్ ఎడితే నక్షత్రాలు ఊరికి దిగొచ్చినట్టే అని ఊరూరంతా అంటారు !! దానికి సూపర్ స్టార్ కటౌట్ సాక్ష్యం ’ అంటూ మహేష్ కటౌట్‌కి లైటింగ్ పెట్టిన వీడియోని ఆయన షేర్ చేశారు. తమ సినిమా తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన సినిమా ప్రమోషన్ చేసుకుంటూనూ మహేష్‌కి విషెస్ తెలిపి ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lHIthC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...