మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌స్టార్ మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అంతేకాక.. ప్రొడ్యూసర్‌కి కూడా కాసుల పంట పండింది. ఈ సినిమాతో పాటు పవన్ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ ఒకటి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రస్తుతానికి ‘ప్రొడక్షన్ నెం.12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్‌గా కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి పవన్‌లుక్‌ని రివీల్ చేయడంతో పాటు షూటింగ్‌కి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కే భారీ స్పందన వచ్చింది. అలాంటిది నిజంగా ఈ సినిమా నుంచి ఓ మాస్ ట్రాక్ వస్తే ఇంకా దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది.. టాప్ లేచిపోవాల్సిందే. ఇప్పుడు అలాంటి అప్‌డేట్ పవన్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ అందించారు. త్వరలోనే సినిమా నుంచి మొదటిపాట విడుదల అవుతుంది అంటూ థమన్ ప్రకటించారు. ‘అసలైన మాస్ ఇదే.. ఇది మన లీడర్ పవన్‌కళ్యాణ్’ కోసం అంటూ ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీనిపై రచయిత రామ్‌జోగయ్య శాస్త్రి కూడా కామెంట్ చేశారు. ‘దిష్టి తగులుతుంది.. ఇప్పుడు నేను ఏమీ చెప్పను. మీరే అర్థం చేసుకోండి’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన రావడంతోనే పవన్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. పాట ఎప్పుడు వస్తుందా అంటూ వాళ్లు తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నిత్య మీనన్ నటిస్తుండగా.. మరో హీరోగా నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37f5P5H
v
No comments:
Post a Comment