Saturday, 7 August 2021

‘సారంగ దరియా’ ఖాతాలో మరో రికార్డు.. అతి తక్కువ సమయంలో ఆ ఘనత

కొన్ని పాటలు ప్రేక్షకులకు అలరిస్తాయి. కొన్ని పాటలు అమితంగా ఆకట్టుకుంటాయి. కొన్ని పాటలు మాత్రం చిరకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. అలా ప్రేక్షకుల మదిలో నిలిచేపోయే పాటల్లో ఈ మాధ్యకాలంలో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘సారంద దరియా పాట ఒకటి. జానపదం స్టైల్‌లో ఉండే పాట.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్ పాటని మరో రేంజ్‌కి తీసుకువెళ్లింది. అచ్చం నెమలి వేసిన స్టెప్పులు పాటకే హైలైట్‌‌గా నిలిచాయి. ఈ పాటకు సుద్దాల ఆశోక్ తేజ సాహిత్యం అందించగా.. మంగ్లీ తన గాత్రం అందించింది. ఇప్పటికే ఈ పాట అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది సారంగ దరియా పాట. అత్యంత వేగంగా 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న పాటగా రికార్డును సాధించింది. లిరికల్ వీడియోకే ఇన్ని వ్యూస్ వస్తే ఒరిజినల్ వీడియో వస్తే ఇంకొన్ని వ్యూస్ వస్తాయో అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ‘లవ్‌స్టోరీ’ సినిమా విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలు , సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమిగో క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నారాయణ్ దాస్, పుష్కర్ రామ్, మోహన్ రామ్ నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CqnfKW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...