సినీ ఇండస్ట్రీలో అనేది కొత్తేమీ కాదు. అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా లొంగదీసుకునే బ్యాచ్‌లు చాలానే ఉన్నాయని ఇప్పటికీ ఎందరో నటీమణులు ఓపెన్‌గా చెప్పేశారు. పడక గదిలోకి వస్తేనే ఆఫర్ ఇస్తా అని నేరుగా చెప్పే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇప్పటికే చాలామంది తారలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల చిట్టాను బయటపెట్టగా.. తాజాగా హీరోయిన్ ఇదే విషయమై రియాక్ట్ అయిన తీరు, ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బ్లాక్‌బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు వరస అవకాశాలు రావడమేనేది సాధారణమైన విషయం. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మలను బాగానే చూసుకుంటుంది సినీ ఇండస్ట్రీ. వాళ్లకు ఆఫర్స్ కూడా బాగానే ఇస్తూ బిజీ హీరోయిన్ చేసేస్తారు మేకర్స్. కానీ తన విషయంలో మాత్రం అలా జరగలేదంటూ బాలీవుడ్ దర్శకనిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది నర్గీస్ ఫక్రీ. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా బాలీవుడ్‌లో రాణించాలంటే దర్శక, నిర్మాతల కోరిక తీర్చాలని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు అలా తనను కూడా కొందరు దర్శకులు, నిర్మాతలు పడుకోవాలని నేరుగా అడిగారంటూ ఓపెన్ అయింది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే వారికి కచ్చితంగా నగ్నంగా కనిపించాల్సిందే అంటూ కుండ బద్దలు కొడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాను అలాంటి వాటికి ఒప్పుకోకపోవడంతో కొందరు ఆఫర్లు రాకుండా చేశారని ఆమె ఆరోపించింది. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'రాక్ స్టార్' మూవీతో కెరీర్ ఆరంభించిన నర్గీస్ ఫక్రీ.. తన తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, గూఢచారి, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలు చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g3kWEn
v
No comments:
Post a Comment