Thursday, 5 August 2021

బాలీవుడ్ బాద్‌షాతో దర్శకుడు అట్లీ సినిమా.. ఫ్యాన్స్‌కి త్వరలో సర్‌ప్రైజ్ ఎప్పుడు అంటే..

‘రాజా రాణీ’, ‘అదిరింది’, ‘బిగిల్’ ఇలా ఏ సినిమా అనుకున్న తనదైన స్టైల్‌లో డిఫరెంట్‌గా రూపొందించడంలో ముందుంటారు దర్శకుడు అట్లీ. ఆయన సినిమాలు అంటే కావాల్సినంత వినోదంతో పాటు ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి ‘బిగిల్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆ తర్వాత పెద్ద సినిమాలు ఏమీ చేయలేదు. అయితే బాలీవుడ్ బాద్‌షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో అట్లీ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది అని టాక్ వినిపిస్తోంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మామూలుగా మారడంతో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయిందట. ఈ సినిమా టీజర్‌ని లేదా సినిమా నుంచి మరేదైనా అప్‌డేట్‌ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల్లో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నారట. మరి సినిమా నుంచి అప్‌డేట్ తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Cn1ETY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...