సినీ సెలెబ్రిటీలకు వారి పనే లోకంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సినిమాలతో బిజీగా ఉంటారు. ఇతరత్రా పనులు వారు చేసుకోలేరు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులు వారు స్వయంగా చేసుకోలేరు. వాటన్నంటి కోసం ఓ మేనేజర్‌ను పెట్టుకుంటారు. అక్కడే కొంత మందికి ఎదురుదెబ్బ తగులుతుంది. కొందరు మేనేజర్లు ఎంతో గొప్పగా బతికిన సెలెబ్రిటీలను నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. అలా తాజాగా నటి పవిత్ర లోకేష్‌ను ఆమె మేనేజర్ మోసం చేసినట్టు తెలుస్తోంది. నటి పవిత్రా లోకేశ్‌ను ఆమె మేనేజర్ మోసం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలోనే ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి. మేనేజర్లను గుడ్డిగా నమ్మి కోట్లు కోల్పోయిన సెలెబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ మధ్య జీఎస్టీ పన్నులు ఎగ్గొట్టిందనే వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. జీఎస్టీ నిబంధనలు, ఎలా చెల్లించాలి, తన ఆదాయ వ్యవహారాలన్నీ కూడా తన మేనేజర్ చూసుకునేవాడని అవన్నీ తనకు తెలియవని అనసూయ క్లారిటీ ఇచ్చారు. తనకు నోటీసులు వచ్చాకే అసలు సంగతి తెలిసిందని, ఆ తరువాత వాటిని కట్టేశానని అనసూయ చెప్పుకొచ్చారు. అచ్చం ఇప్పుడు కూడా ఇలాంటి ఓ ఘటనే నటి పవిత్ర లోకేష్‌కు జరిగింది. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. ఈక్రమంలో దాదాపు రూ.60 లక్షలకు పైగా లెక్కల్లో తేడా జరిగిందని తెలుస్తోంది. జీఎస్‌టీ చెల్లింపులు చేయకపోవడంతో.. ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్‌కు నోటీసులు అందాయని తెలుస్తోంది. నోటీసులు వచ్చే వరకు కూడా పవిత్ర లోకేష్‌కు అసలు సంగతి తెలియలేదట. అలా నోటీసులు రావడంతో షాక్ అయ్యారని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V2cxcZ
v
No comments:
Post a Comment