Monday, 2 August 2021

ఆ దర్శకుడితో రవితేజా నెక్ట్స్ మూవీ.. మాస్ మహరాజ ఫామ్ మాములుగా లేదుగా.?

మాస్ మహరాజ రవితేజకు తెలుగులో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమా వస్తే చాలు ఎంజాయ్ చేస్తామని ప్రేక్షకులు అనుకుంటారు. అలా కొంతకాలం క్రితం వరకూ చాలా సినిమాల్లో ఆయన వినోదం పంచారు. అయితే వరుస హిట్లతో దూసుకుపోయిన .. కొన్ని సినిమాలలో ప్లాపులు కూడా చవిచూశారు. దీంతో ఆయన టాలీవుడ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఆ బ్రేక్ తర్వాత ‘రాజ ది గ్రేట్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు రవితేజా. ఈ సినిమాలో అంధుడి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అయితే ఆయనకు ఊహించినంత సక్సెస్ ఈ సినిమాతో లభించలేదు. ఈ సినిమా తర్వాత కూడా ఆయన ఫ్లాప్‌లు చవి చూశారు. ప్రస్తుతం ‘ఖిలాడీ’ ‘రామారావు అన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే రీసెంట్‌గా రవితేజా తదుపరి సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ‘ఛలో’ .. ‘భీష్మ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు దర్శకత్వంలో రవితేజా త్వరలో సినిమా చేస్తున్నారని టాక్. ఇప్పటికే వెంకీ.. రవితేజాకు కథ వినిపించడగా.. ఆయన ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయిత ఈ సినిమాపై స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3llNMmH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...