‘క్రాక్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో మాస్ మహరాజ మళ్లీ రచ్చ చేయడం మొదలుపెట్టేశారు. వరుస ఫ్లాపులతో సతమతమైన రవితేజకు క్రాక్ ఊరటనిచ్చింది. అలా ఇప్పుడు మళ్లీ రవితేజ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేశారు. అందులో ఆల్రెడీ ‘’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే రీసెంట్‌గా మరో సినిమాను కూడా ప్రకటించారు మాస్ మహరాజ. యదార్థ సంఘటనలతో రూపొందుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాతో ఆయన త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే ‘ఖిలాడీ’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఓ ప్రత్యేక పాటలో మెరువనుందనే వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే రవితేజతో కలిసి ఇలియానా ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో నటించింది. అయితే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె టాలీవుడ్‌వైపు చూడలేదు. కానీ, అక్కడ మంచి సక్సెస్ లభించకపోవడంతో.. మళ్లీ టాలీవుడ్‌కి ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కాస్త బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ మధ్యకాలంలో ‘ది బిగ్ బుల్’ అనే సినిమాతో అక్కడ మంచి సక్సెస్‌నే అందుకుంది ఇలియానా.. కానీ, ఈ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె మరోసారి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని.. అది ‘ఖిలాడీ’ సినిమాతోనే అని ఫిలిమ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CTKNIi
v
No comments:
Post a Comment