Wednesday, 25 August 2021

ఇదిగో నా ఫస్ట్ లవర్.. కాలేజీ రోజుల్లో మేమిద్దరం! టాప్ సీక్రెట్ రివీల్ చేసిన ఆర్జీవీ.. నెటిజన్స్ అటాక్

మొదటి నుంచే తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న , ఈ మధ్యకాలంలో సంచలనాలకు మారుపేరుగా మారిపోయారు. తనకు మాత్రమే సొంతం అన్నట్లుగా ఆయన చేస్తున్న కామెంట్లు, పోస్ట్ చేస్తున్న వీడియోలు జనాల్లో పలు చర్చలకు తెరలేపుతున్నాయి. దీంతో సోషల్ మీడియా, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ ఎక్కడ చూసినా వర్మ హంగామానే కనిపిస్తోంది. ఆయనలోని ముక్కుసూటితనం నిత్యం వార్తల్లో నిలుపుతోంది. ఇకపోతే తన సినిమాల్లో నటించే హీరోయిన్స్, తనను ఇంటర్వ్యూ చేసే యాంకర్ల విషయంలో రామ్ గోపాల్ వర్మ ఎలా వ్యవహరిస్తారనేది మనందరికీ తెలుసు. మనసులో ఏదీ దాచుకోలేని తత్వం మనోడిది. ఎదురుగా ఉన్న అమ్మాయిపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా వెంటనే బయటపెట్టే గుణం ఈ వివాదాస్పద దర్శకుడిది. అలా ఆయన చేసిన కామెంట్స్‌తో, చేష్టలతో ఫేమస్ అయిన అందాల భామలు చాలామందే ఉన్నారు లెండి. అలాగే ఆయన సోషల్ మీడియా వాల్‌పై ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పడుతుందో ఏ ఒక్కరూ ఊహించలేరు. ఈ నేపథ్యంలోనే తాజాగా అలాంటి ఓ పోస్ట్ చేసి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు వర్మ. తన ఫస్ట్ లవర్ అంటూ ఏకంగా ఆమె స్విమ్ సూట్ ఫొటో పోస్ట్ చేశారు. ఆమె పేరు సత్య అని, విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో తామిద్దరం లవర్స్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుందని తెలిపారు. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ అటాక్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. లాజిక్స్ మాట్లాడుతూ 'ఇంజనీరింగ్ టు మెడికల్' వావ్! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ''నువ్వు మందులో ఉన్నావా సామీ, ఎకనామిక్స్‌లో మ్యాథ్స్ నేర్చుకునే బ్యాచ్ నువ్వు'' అంటూ షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zixor8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...