Saturday, 7 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: వీణ పట్టిన కాజల్.. మీకు నచ్చిందా అంటూ పూజా.. నవ్వులు చిందిస్తున్న ‘హాసినీ’

వీణ పట్టిన .. హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో సక్సెస్ అందుకొని.. ఈ మధ్యే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్. కొంతకాలం క్రితం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా తన నటనలో జోష్ తగ్గించలేదు. తాజాగా వీణ పట్టుకొని కొన్ని ఫోటోలకు పోజులు ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. కిల్లింగ్ లుక్స్‌తో కైపెక్కిస్తున్న హీరోయిన్ రాయ్ లక్ష్మి సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తరచూ హాట్ ఫోటోలతో ఆమె కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. తాజాగా మరో హాట్ ఫోటోని షేర్ చేసింది రాయ్ లక్ష్మి. బ్లాక్‌ డ్రెస్‌లో తన చూపులతోనే గుచ్చేస్తూ.. పిక్‌ని షేర్ చేసిన లక్ష్మి.. ‘ఎలాంటి నక్షత్రం అయినా.. మనకి వెలుగు ఇస్తుంది’ అంటూ దీనికి క్యాప్షన్ పెట్టింది. మీకు నచ్చిందా అని ప్రశ్నిస్తున్న పూజా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు.. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. అయితే సోషల్‌మీడియాలో కూడా ఈ బామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ‘మిమ్మల్నే చూస్తున్నాను.. మీకు నచ్చిందా’ అంటూ ఫ్యాన్స్‌ని ప్రశ్నిస్తూ ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది ఈ బుట్టబొమ్మ. ఇలా ఇంతవరకూ ఎవరిని చూడలేదు అంటున్న రాశీ ఫిట్‌గా కనిపించడం కోసం హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎంతో డైటింగ్ చేస్తారు. మంచి ఫిజిక్ కోసం తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా వాళ్లు వదులుకుంటారు. అయితే ఈ డైటింగ్ సమయంలో ఒక రోజు ఛీట్ మీల్ పేరుతో ఇష్టమొచ్చిన ఆహారాన్ని లాగిస్తారు. తాజాగా ఇదే పని చేశారు. ఓ బర్గర్ పట్టుకొని.. దాన్ని ఎంతో ప్రేమగా చూస్తే.. ఇలా ఇంత వరకూ ఎవరినీ చూడలేదు అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఇదే అందమైన రోజు.. నవ్వులు చిందిస్తున్న ‘హాసిని’ ‘హాసిని’ ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే ఒకే ఒక పేరు . తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. వివాహం తర్వాత నటనకు దూరం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది. తాజాగా ఎల్లో డ్రెస్‌లో నవ్వులు చిందిస్తూ.. ‘ఇదే అందమైన రోజు’ అంటూ కొన్ని పిక్స్‌ని షేర్ చేసింది జెనిలియా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CAGKRp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...