Wednesday, 4 August 2021

Acharya న్యూ పోస్టర్.. చిరు,చెర్రీ తాపీగా అలా!

మెగాస్టార్ , మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తోన్న చిత్రం . కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ భారీ మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటేశాయి. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వాయిదాలు పడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే రావాల్సిన ఈ మూవీ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. కానీ తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అసలే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది వరకు వదిలిన టీజర ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. చిరంజీవి చెప్పిన డైలాగ్, చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది. ఇక లాహే లాహే అంటూ వదిలిన పాటకు అందరూఫిదా అయ్యారు. చాలా గ్యాప్ తరువాత చిరంజీవి మణిశర్మ మ్యాజిక్‌ను మళ్లీ తెలుగు ప్రేక్షకులు ఆస్వాధించారు. అలా లాహే లాహే పాటలో చిరు వేసిన సింపుల్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. అలా ఆచార్య కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అయిందని, ఇంకా రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ బ్యాలెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆచార్య నుంచి ఓ స్టిల్‌ను వదిలారు. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ అలా కూర్చుని పోజులిచ్చారు. నక్సలైట్ల అవతారంలో ఉన్న ఈ తండ్రీ కొడుకులిద్దరినీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jl0iAc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...