Tuesday, 13 July 2021

Vishal: ఎనిమీ.. ఓ పని ఫినిష్ చేశామంటూ మేకర్స్ అఫీషియల్ మెసేజ్

విశాల్, కలిసి తెర పంచుకోబోతున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ‘ఎనిమీ’ షూటింగ్‌ పూర్తయింద‌ని హీరో తెలిపారు. 10 సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత విశాల్, ఆర్య క‌లిసి నటిస్తున్న సినిమా ఇదే కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మమతా మోహన్‌ దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ''ఎనిమీ షూటింగ్ విజయవంతగా పూర్తి చేశాం. టీజర్‌ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకు మళ్లీ ఆర్యతో కలిసి వర్క్‌ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్, కెమెరామ్యాన్‌ ఆర్‌డి రాజశేఖర్, నిర్మాత వినోద్‌ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్‌ అందరికీ ధన్యవాదాలు'' అని విశాల్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ థమన్ బాణీలు కడుతున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా పూర్తి చేసి అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీపై విశాల్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో పాటు శరవణన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు హీరో విశాల్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ySsoJf
v

No comments:

Post a Comment