Wednesday, 14 July 2021

Shankar : RAPO19 యూనిట్‌కు శంకర్ సర్ ప్రైజ్.. ఇస్మార్ట్ హీరోతో ఇండియన్ డైరెక్టర్!

ఇండియన్ డైరెక్టర్ పేరుకు పరిచయమే అక్కర్లేదు. భారత సినీ పరిశ్రమకు శంకర్ అందించిన చిత్రాలే ఆయన సత్తా ఏంటో చెబుతుంటాయి. దక్షిణాది చిత్రాల సత్తువ ఏంటో చూపించారు. తీసిన ప్రతీ చిత్రంలోనూ సామాజిక కోణాన్ని టచ్ చేయడం ఆయన ప్రత్యేకత. అయితే గత కొన్నేళ్ల నుంచి ఆయన స్థాయికి తగ్గట్టుగా ఒక్క విజయం కూడా అందుకోలేకపోతోన్నారు. 3 ఇడియట్ రీమేక్, రోబో సీక్వెల్, ఐ సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఎంతో భారీ స్థాయిలో భారతీయుడు సీక్వెల్ సినిమాను ప్రారంభించిన శంకర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అలా మొత్తానికి శంకర్ తన కొత్త ప్రాజెక్ట్‌ను చరణ్‌తో చేయబోతోన్నారు. ఈ క్రమంలో శంకర్ హైద్రాబాద్‌లోనే మకాం పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే శంకర్ తాజాగా RAPO19 యూనిట్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించి దూసుకుపోతోంది చిత్రయూనిట్. ఇలాంటి సమయంలో శంకర్ సడెన్‌గా సెట్‌కు వచ్చారు. శంకర్ తమ సెట్‌కు రావడంతో యూనిట్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక సినిమా షూటింగ్‌ను పరీక్షించిన శంకర్ హీరో రామ్‌తో కాసేపు ముచ్చట్లు పెట్టినట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ లింగుసామి, శంకర్ , నదియా, కృతి శెట్టి ఇలా అందరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి శంకర్ రాకతో RAPO19 మళ్లీ వార్తల్లోకి ఎక్కేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ehTwcF
v

No comments:

Post a Comment