Thursday, 1 July 2021

RT 68: ఎమ్మార్వోగా రవితేజ డేరింగ్ స్టెప్.. క్రేజీ టైటిల్‌తో మాస్ మహారాజ్ ఎంట్రీ..!

ఇటీవలే 'క్రాక్' సక్సెస్ ఖాతాలో వేసుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాస్ మాహారాజ్ మరో సినిమాతో సెట్స్ పైకి వచ్చేశారు. డిఫరెంట్ కథలతో కుస్తీ పడుతున్న ఆయన, ఎమ్మార్వోగా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజ 68వ ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన ఈ చిత్రాన్ని నేడు (గురువారం) సెట్స్ మీదకు తీసుకొచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఆర్‌టి టీమ్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు '' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వ అధికారి ఎమ్మార్వోగా రవితేజ అప్పీయరెన్స్ అబ్బురపరిచేలా ఉండబోతోందట. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ఇకపోతే రవితేజ నటిస్తున్న తాజా సినిమా 'ఖిలాడి' షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లింగ్, యాక్షన్ కలగలుపుతూ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా 'ఖిలాడి' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో పాటు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమాకు కమిటయ్యారు రవితేజ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yfhlt9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...