Tuesday, 20 July 2021

RRR: అందుకోసం కోట్లలో ఖర్చు! అస్సలు వెనక్కి తగ్గని రాజమౌళి.. స్పెషల్ అట్రాక్షన్ ఆమెనే

దర్శకధీరుడు సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలుసు. లొకేషన్స్ పరంగా, టెక్నికల్‌గా భారీ హంగులతో సినిమా రూపొందించడం ఆయన నైజం. ఎంత సమయం పట్టినా ఫర్వాలేదు కానీ అనుకున్న అవుట్‌పుట్ వచ్చేంత వరకూ ఎక్కడా తగ్గరు జక్కన్న. తాజాగా ఆయన రూపొందిస్తున్న భారీ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతున్న రాజమౌళి.. ఈ సినిమాలోని ఒక్క పాట కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఒక్క పాట కోసం అంత బడ్జెట్ కేటాయించడమంటే ఆశ్చర్యపరిచే విషయమే. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదట. RRRలో ఈ సాంగ్ హైలైట్ అయ్యేలా ఆయన పక్కాగా ప్లాన్ చేశారట. ఇప్పటికే RRR టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా.. ఈ పాటను సోమ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన తారాగ‌ణమంతా ఈ సాంగ్‌లో పాల్గొంటున్నారు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ మేజర్ అట్రాక్షన్ కానుందట. బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రీయ, రే స్టీవెన్ సన్‌, అలిస‌న్ డూడి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ద‌స‌రా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13వ తేదీన విడుద‌ల చేయాలని పట్టుదలగా ఉన్నారు జక్కన్న.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kEniwh
v

No comments:

Post a Comment