Sunday, 11 July 2021

RRR: మరో సర్‌ప్రైజ్ రెడీ చేసిన రాజమౌళి.. మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్

దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూస్తున్న భారీ సినిమా RRR. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన .. మళ్ళీ అదే రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ కలగలుపుతూ మెగా, నందమూరి ఫ్యాన్స్ ఉర్రూతలూగేలా ప్లాన్ చేసిన జక్కన్న.. ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ చేశారు. ఈ మేరకు తాజాగా దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. చాలా రోజులుగా ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది RRR టీమ్. మరో నాలుగు రోజుల్లో అనగా జులై నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు Roar Of RRR పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరు హీరోలకు సంబంధించిన కొన్ని మేకింగ్ సీన్స్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు షూటింగ్ వాయిదా పడటంతో సెకండ్ వేవ్ అనంతరం షూటింగ్ స్పీడు పెంచారు జక్కన్న. ఎలాగైనా అతి త్వరలో షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసి.. చెప్పిన తేదీ అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయాలని బలంగా ఫిక్సయ్యారు. ఈ భారీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vm3Ae8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...