సమాజంలోని ఎలాంటి విషయంపై అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పే .. తాజా రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన అక్కాచెల్లెళ్లపై జరిగిన దాడిని ఖండిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంత కాలంగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. పెద్దలు ఇలా వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతుందని ఆగ్రహంతో ఆ అక్కచెల్లళ్ళను చితకబాదారు ఆ కుటుంబ సభ్యులు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన వర్మ వెంటనే రియాక్ట్ అవుతూ వాళ్లపై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా శిక్షించాలని కోరారు. ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. దాడికి పాల్పడిన వాళ్లందరికీ తగిన శిక్ష వేయకపోతే.. తనకు ఈ దేశంపై ఉన్న నమ్మకం పోతుందని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందనేది పక్కనబెడితే మానవత్వం మంట గలిసేలా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన ఎవ్వరినీ వదలొద్దు' అంటూ కామెంట్స్ చేస్తూ వర్మను సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AsCcv6
v
No comments:
Post a Comment