Thursday, 15 July 2021

RAPO19: రామ్, లింగుస్వామి మూవీలో.. కీలక పాత్రలో నటిస్తున్న నదియా

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న నటుడు . కెరీర్ ఆరంభంలో వరుసగా విజయాలు అందుకున్న హీరో రామ్.. ఆ తర్వాత అదేస్థాయిలో ఫెయిల్యూర్స్‌ని చవి చూశాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మాస్ హైదరాబాదీ యువకుడి పాత్రలో కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటివరకూ చాక్లెట్ బాయ్‌గా కనిపించిన రామ్.. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ రోల్స్‌ని కూడా రఫ్పాడించగలడని నిరూపించాడు. ఆ తర్వాత ‘రెడ్’ అనే సినిమాలోనూ డ్యుయల్ రోల్‌లో అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం రామ్.. దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ ఓ పోలీస్ అఫీసర్ పాత్రలో నటించనున్నాడని ఫిలిమ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ నదియా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’, ‘మిర్చి’, ‘అ..ఆ’ సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ చేశారు నదియా. ఈ సినిమాల్లోనూ ఆమె ఎంతో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘వరుడు కావలెను’, ‘దృశ్యం-2’ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా రామ్, లింగుస్వామి సినిమాలో కూడా ఆమె చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లోని తన లుక్‌ని నదియా స్వయంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wJOyvP
v

No comments:

Post a Comment