Sunday, 25 July 2021

Pushpa: అల్లు అర్జున్‌తో సన్నీలియోన్.. థియేటర్స్ దద్దరిల్లే మాస్టర్ ప్లాన్! అదే ఫైనల్ చేసిన సుక్కు..

బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప' మూవీ గురించి వస్తున్న అప్‌డేట్స్ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ మేరకు భారీ తారాగణంతో పుష్ప రాజ్‌ని థియేటర్లలోకి దించుతున్న ఆయన, మాజీ శృంగార తార సన్నీలియోన్‌తో మాస్టర్ ప్లాన్ చేశారనే సమాచారం వైరల్ అవుతోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత 'పుష్ప' మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తన మార్క్ కనిపించేలా ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన సుకుమార్.. ఇందుకోసం సన్నీలియోన్‌కి సూపర్ ఆఫర్ ఇచ్చారట. పుష్ప రాజ్‌తో చిందేసేందుకు ఓ స్పెషల్ లేడీని రంగంలోకి దించాలని భావించిన సుక్కు, మొదట ఊర్వశీ రౌతేలా, దిశా పటానీ, శ్రద్ద కపూర్ లాంటి హీరోయిన్స్‌పై ఫోకస్ పెట్టారు. కానీ చివరకు సన్నీలియోన్‌తో చేస్తే హైలైట్ అవుతుందని డిసైడ్ అయి ఆమెనే ఫైనల్ చేశారని సమాచారం. అలాగే ఈ ఒక్క సాంగ్ కోసం సన్నీకి 50 లక్షల రూపాయల రెమ్మ్యూనరేషన్ ఇస్తున్నారని ఫిలిం నగర్ టాక్. అల్లు అర్జున్- సన్నీలియోన్‌లతో థియేటర్స్ దద్దరిల్లే మాస్టర్ ప్లాన్ చేశారట సుకుమార్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బన్నీ మాస్ లుక్స్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో అది కూడా రెండు భాగాలుగా 'పుష్ప' సినిమాను రూపొందిస్తుండటం సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్‌తో పాటు జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఈ సినిమాలో భాగమవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x6JsKa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...