Friday, 9 July 2021

Pushpa: అనసూయ ఎంటర్.. అంతకుమించి అనేలా! జబర్దస్త్ బ్యూటీతో సుకుమార్ పక్కా స్కెచ్..

బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ఫాలోయింగ్ కూడగట్టుకున్న అనసూయకు వెండితెరపై బాగా గుర్తింపు తెచ్చింది మాత్రం 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్రనే. ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వెండితెరపై కూడా సత్తా చాటగలను అని నిరూపించింది ఈ జబర్దస్త్ బ్యూటీ. క్రియేటివ్ డైరెక్టర్ తీర్చిదిద్దిన ఈ రోల్‌ చూశాక అంతా ఆమెను రంగమ్మత్త అనడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అదే సుకుమార్ ఆమెతో మరో మ్యాజిక్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ఆయన పక్కా స్కెచ్ వేశారట. తానే సృష్టించిన రంగమ్మత్త పాత్రను మరిపించేలా అనసూయతో అంతకుమించిన స్కెచ్చేసిన సుక్కు.. 'పుష్ప' మూవీలో వెండితెరపై ఆమె జబర్దస్తీ కనిపించేలా ప్లాన్ చేసి రంగంలోకి దించుతున్నారట. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది. అల్లు అర్జున్, ఇతర ప్రధాన తారలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌ రోల్‌లో అల్లు అర్జున్ మాస్ రోల్ పోషిస్తుండగా.. గిరిజన యువతిగా రష్మిక అప్పీయరెన్స్, అనసూయ రోల్ ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయట. ఇకపోతే ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hLRFhk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...