Tuesday, 27 July 2021

Porn Rocket కేసులో లక్స్ పాప! రాజ్ కుంద్రాతో డీలింగ్స్, వాట్సాప్ చాట్‌పై ఆశా షైనీ రియాక్షన్

పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోల ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పోలీస్ విచారణలో భాగంగా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ కేసులో టాలీవుడ్ నటి ఫ్లోరా షైనీ () పేరు బయటకు రావడంతో వెంటనే ఆమె రియాక్ట్ అయింది. ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. రాజ్‌ కుంద్రా సన్నిహితుడు ఉమేశ్‌ కామత్‌తో ఫ్లోరా షైనీకి మంచి స్నేహ బంధం ఉందని, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ ఓ వాట్సాప్‌ చాట్ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో క్లారిటీ ఇచ్చిన ఫ్లోరా షైనీ.. ఉమేశ్‌ కామత్‌తో గానీ, పోర్న్ రాకెట్ కేసుతో గానీ తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పింది. అవన్నీ వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేసిన ఆమె, నన్ను సంప్రదించకుండా పైగా ఆ చాట్స్‌ నిజమైనవో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేయడం సరికాదని చెప్పింది. గతంలో ఎప్పుడూ రాజ్ కుంద్రాతో మాట్లాడింది కూడా లేదని ఫ్లోరా షైనీ చెప్పింది. వాళ్ళ క్యాస్టింగ్ టీమ్ పలు మార్లు నాకు కాల్ చేసి హాట్ షాట్స్ యాప్ కోసం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ చేయమని అడిగినా తాను మాత్రం ఓకే చెప్పలేదని తెలిపింది. పోర్న్ రాకెట్‌లో తన ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా ఇలా పేర్లు బయటపెట్టి ఈ కేసులోకి లాగడం బాధగా ఉందని చెప్పిన ఆమె, ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది ఓ మహిళ జీవితంతో చెలగాటం ఆడుకోవడమే అంటూ ఆవేదన చెందింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zWE2Ub
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...