Monday, 26 July 2021

Pawan Kalyan : దేవర వేట మొదలైంది!.. రంగంలోకి ‘భీమ్లా నాయక్’.. చేతులెత్తి మొక్కిన బండ్లన్న

సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. బండ్ల గణేష్ వేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. విషయాన్ని ప్రస్థావిస్తూ బండ్లన్న వేసే ట్వీట్ ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తుంటుంది. బండ్ల గణేష్‌కు ఎక్కువగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ ఉంటుంది. అతడిని ఎక్కువగా పవర్ స్టార్ అభిమానులు ఫాలో అవుతుంటారు. అందుకే బండ్ల గణేష్ వేసే ట్వీట్లు సోషల్ మీడియాలో అంతగా వైరల్ అవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ బండ్లన్న వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా సెట్‌లోకి అడుగుపెట్టేశారు. పవన్ రానా కాంబోలో వస్తోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇంత వరకు రాలేదు. కానీ నేడు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. నేడు ఖాకీ చొక్కా ధరించి సెట్‌లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టేశారు. అయితే ఈ మేరకు చిత్రయూనిట్ అసలు సంగతిని బయటపెట్టేశారు. భీమ్లా నాయక్ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారనే విషయాన్ని చెప్పేశారు. ఇన్ని రోజులు క్యారెక్టర్ పేరును దాచి పెట్టిన చిత్రయూనిట్ నేడు సీక్రెట్ రివీల్ చేశారు. ఇక చిత్రయూనిట్ వదిలిన స్టిల్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఆ స్టిల్‌ను బండ్లన్న షేర్ చేస్తూ.. దేవర వేట మొదలైంది అని చెప్పుకొచ్చారు. ఇక ఆ స్టిల్‌కు, నిల్చున్న విధానానికి బండ్లన్న చేతులెత్తి మొక్కేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Ym7ji
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...