Wednesday, 14 July 2021

Narappa Trailer: చించేసిన విక్టరీ హీరో.. భారీ హైప్ క్రియేట్ చేసిన వెంకీ పవర్‌ఫుల్ సీన్స్

తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అసురన్’ని తెలుగులో ‘’ పేరుతో రీమేక్ చేశారు. విక్టరీ హీరోగా నటించిన ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. చాలా రోజుల క్రితమే విడుదలకు సిద్దమైన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. జులై 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. దీంతో దగ్గుబాటి అభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వెంకటేష్ డిఫరెంట్ లుక్, ప్రియమణి నాచురల్ అందాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ఆసక్తి పెరగగా.. తాజాగా ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా 'నారప్ప' ట్రైలర్ ప్రేక్షకుల ముందుంచింది చిత్రయూనిట్. ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచేశాయి. రెండు డిఫరెంట్ లుక్స్‌లో వెంకీ చేసిన ఫైట్ సీన్స్ హైలైట్ అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్ల సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ బాణీలు కట్టారు. వెంకటేష్ కెరీర్‌లో 74వ సినిమాగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 'నారప్ప' నుంచి రీసెంట్‌గా విడుదలైన 'చలాకీ చిన్నమ్మి' సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r82XAI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...