Tuesday, 6 July 2021

Mishan Impossible: మరో డిఫరెంట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తాప్సి!!

సొట్ట బుగ్గల సుందరి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్‌‌గా క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ ఆశించిన మేర విజయాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఆమె కొంతకాలంగా హిందీ సినిమాలతో బిజీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో ఆమె నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకత్వంలో రాబోతున్న '' అనే తెలుగు సినిమాకు ఒకే చెప్పినట్లు చిత్రయూనిట్ తెలిపింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా తాప్సికి వెల్‌కమ్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది 'మిషన్ ఇంపాజిబుల్' టీమ్. ఈ పోస్టర్‌లో తాప్సి ల్యాప్‌టాప్‌ని చూస్తూ కనిపించింది. ఈ స్రిప్టు తనను ఎంతో ఆకట్టుకుందని, కొంత కాలంగా ఇలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన తాప్సి.. మ్యాట్నీ వంటి సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపింది. చివరగా 2018లో నివెవరో అనే డైరెక్ట్ తెలుగు సినిమా చేసిన తాప్సి.. అనంతరం 'గేమ్ ఓవర్' అనే సినిమా చేసి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jRnlV9
v

No comments:

Post a Comment