Sunday, 25 July 2021

HBD Kaikala Satyanarayana : మధురమైన అనుభూతి.. చిరు ఎమోషనల్

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేకత ఉంది. మంచైనా, చెడైనా సరే ముందుంటారు. ప్రతీ ఒక్కరికీ తన విషెస్ తెలుపుతుంటారు. ఫస్ట్ కాల్ చిరంజీవి దగ్గరి నుంచే వస్తుందని ఇండస్ట్రీలోని చాలా మంది సెలెబ్రిటీలు చెబుతుంటారు. ఇక కొందరి విషయంలో అయితే చిరంజీవి స్వయంగా కదిలి వస్తారు. ఆ మధ్య కళాతపస్వి విశ్వనాథ్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి గురువు వంటి వారని పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలా చిరంజీవి సీనియర్స్‌ను ఎంతో గౌరవిస్తుంటారు. తాజాగా చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన, మరెంతో సన్నిహితులైన నటుడు కైకాల సత్య నారాయణ ఇంటికి వెళ్లారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈక్రమంలో అయన్ను నేరుగా విష్ చేసేందుకు చిరంజీవి వెళ్లారు. నేటి ఉదయం సతీసమేతంగా చిరంజీవి కైకాల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చెప్పుకొచ్చారు. చిరంజీవి కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలు వచ్చాయి. విలన్‌గా, తండ్రిగా, మామగా, శ్రేయోభిలాషిగా ఇలా ఎన్నో రకాల పాత్రలను చిరంజీవి పక్కన కైకాల పోషించారు. యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గుండా, రాజా విక్రమార్క, బావగారు బాగున్నారా ఇలా చివరగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అందరి వాడు చిత్రం వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UPgFN4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...