Friday, 2 July 2021

F3 Movie అప్డేట్.. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు!

టాలీవుడ్‌లో మళ్లీ తారల సందడి మొదలైంది. షూటింగ్‌లతో ఇండస్ట్రీల అంతా కళకళలాడుతోంది. చిన్నా, పెద్ద సినిమాలన్నీ కూడా సెట్స్ మీదకు వచ్చేశాయ్. ఇంకా కొన్ని వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా పూర్తి దశకు వచ్చిన ప్రాజెక్ట్‌లు మాత్రం ముందుగా షూటింగ్‌ను మొదలెట్టేశాయి. త్వరగా పూర్తి చేసేసుకుని, సరైన సమయం చూసి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో , కాంబినేషన్‌లో రాబోతోన్న ఎఫ్ 3 మూవీ కూడా లైన్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావాల్సిన ఈ మూవీపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఎఫ్ 2 లాంటి భారీ సక్సెస్ తరువాత సీక్వెల్‌గా రాబోతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ సారి మరింత ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఎఫ్ 3 షూటింగ్‌లో బిజీగా ఉండగానే డైరెక్టర్ కరోనా బారిన పడ్డారు. అలా ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు మళ్లీ సెట్ మీదకు వచ్చేశారు. నేడు ప్రారంభమైన షూటింగ్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కూడా పాల్గొన్నారు. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు అంటూ సినిమా షూటింగ్ ప్రారంభమైందని నిర్మాతలు ప్రకటించారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అదిరిపోయే ఐటెం సాంగ్‌ను కూడా పెట్టబోతోన్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎఫ్ 3 రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w7rC9D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...