ఈ సమాజంలో కళ్ళకు కనిపించే దేవుళ్ళు డాక్టర్లు అంటుంటారు పెద్దలు. గత ఏడాదికి పైగా కారోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి డాక్టర్లు చేస్తున్న సేవలు చూస్తుంటే అది అక్షరాలా నిజం అనిపిస్తోంది. అలాంటి రియల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది '' మూవీ. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను సినీ నిర్మాత రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌పై డి.ఎస్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'డాక్టర్ సాబ్' మూవీలో శోభన్ హీరోగా నటిస్తున్నాడు. నిత్యం డాక్టర్స్ ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్‌గా చేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమాను సమర్పిస్తుండడం విశేషం. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేమని, వాళ్ళే నిజమైన దేవుళ్ళని అన్నారు. అలాంటి డాక్టర్స్‌లో ఒకరు శోభన్. ఆయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ చిత్ర లోగోని విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. నన్ను నమ్మి ఈ సినిమాను తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ గారికి కృతజ్ఞతలు అని దర్శకుడు డిఎస్‌బి పేర్కొన్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dxDlrh
v
No comments:
Post a Comment