Thursday, 15 July 2021

బాలీవుడ్ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ స్టార్‌ డైరెక్టర్‌ చేతుల మీదుగా లాంచ్?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా.. ‘అల్లుడు శీను’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు . పెద్ద డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లతో నటించినప్పటికీ అతనికి మంచి సక్సెస్, స్టార్ హీరో స్టేటస్ లభించలేదు. ఈ ఏడాది నబా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ‘అల్లుడు అదుర్స్’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు అతను. కానీ, ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరించింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో అతను తెలుగు సినిమాలను కొంతకాలం పక్కన పెట్టి.. బాలీవుడ్‌లో జెండా పాతాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతనో బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌‌లో శ్రీనివాస్ నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చాలామంది స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం అడడగా.. చివరిగా అనన్య పాండే ఇందులో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులకు సంబంధించిన పూజా కార్యక్రమం శుక్రవారం జరుగనుంది. అయితే తన బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండాలని భావించిన శ్రీనివాస్.. ఈ పూజా కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడట. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ రాజమౌళికి మంచి క్రేజ్ ఉంది. పైగా ‘ఛత్రపతి’ తెలుగు సినిమాకి ఆయన దర్శకుడు. దీంతో రాజమౌళి చేతుల మీదుగా బాలీవుడ్‌లో లాంచ్ అయితే.. తనకు కలిసొస్తుందని శ్రీనివాస్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి బెల్లంకొండ ప్లాన్ ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3einPjK
v

No comments:

Post a Comment