Friday, 9 July 2021

అల్లు శిరీష్‌కు గాయం.. మొత్తానికి దానిపైనా ఓ సెటైర్!

యంగ్ హీరో సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో సినిమా చేస్తూ.. ఆఫ్ సెట్స్ సందడి చేస్తున్నారు. ఈ జోడి చేసే హంగామాకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. మొత్తానికి అల్లు శిరీష్ మాత్రం తన తదుపరి సినిమా కోసం ప్రమోషన్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే అల్లు శిరీష్ ఇప్పుడు బాడీ పెంచే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా జిమ్‌లో అల్లు శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. అల్లు శిరీష్ బాడీ మీద ఆర్జీవీ వేసిన వెరైటీ ట్వీట్ కూడా వైరల్ అయింది. అలా మొత్తానికి అల్లు శిరీష్ తన శరీరాకృతిని మార్చేసుకుంటున్నారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల కోసమే ఇదంతా చేస్తున్నట్టున్నారు. అసలే హిట్ లేక అల్లు శిరీష్ సతమతమవుతున్నాడు. అల్లు శిరీష్‌కు తన మెడకు బ్యాండ్‌ వేసిన ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. ఇది ఫ్యాషన్‌ కోసం అనుకునేరు.. వర్కవుట్లు చేస్తున్న క్రమంలో మెడ పట్టేసుకుంది.. అందుకే ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది అని క్లియర్‌గా క్లారిటీగా చెప్పుకొచ్చారు. మామూలుగా అన్నింటిపైనా సెటైర్ వేసే అల్లు శిరీష్.. ఇలా తనకు గాయం అవ్వడం, ఆ పట్టి పెట్టుకోవడంపైనా సెటైర్ వేశారు. ‘ఎబిసిడి’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్న ఆయన రాకేష్‌ శశి దర్శకత్వంలో ‘ప్రేమ కాదంట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ కాదంటా అంటూ అల్లు శిరీష్‌లు చేస్తున్న సందడి అంతా చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న కారులో టీ తాగుతూ చీర్స్ చెప్పుకున్నారు.. ఆ తరువాత ఏకంగా మందు గ్లాసుతోనే చీర్స్ చెప్పుకున్నట్టున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36oYoIK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...