Tuesday, 6 July 2021

ఒక్క హైద్రాబాద్ హోటల్స్‌లోనే అలా.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఆవేదన

ప్రస్తుతం సాధారణ ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు అందరిలోనూ మూగ జీవాల మీదున్న దృక్పథం మారుతోంది. కొందరు సొంత పిల్లల కంటే పెట్స్‌నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కొందరు సెలెబ్రిటీలు పెట్స్ మీద ఎనలేని ప్రేమను కనబరుస్తుంటారు. అవి తమ బిడ్డలేనని ప్రకటిస్తుంటారు. అలా ఛార్మీ, కీర్తి సురేష్, , రష్మీ గౌతమ్ వంటి వారు సోషల్ మీడియాలో పెట్స్ గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంటారు. తమ పెట్స్‌కు సంబంధించిన ప్రతీ విషయాలను షేర్ చేస్తుంటారు. మామూలుగా ఈ పెట్స్‌ను విమానాల్లో తీసుకెళ్లలేం. మనతో పాటు పక్కనే ఉండేలా చూసుకోవడం కుదరదు. కానీ ఇప్పుడు ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఐదు కేజీల లోపల ఉండి, చిన్న పెట్ అయితే తమతో పాటే తీసుకెళ్లొచ్చట. ఈ క్రమంలో తన పెట్ మొదటిసారిగా తనతో ఇలా ప్రయాణం చేసిందని విమానయాణం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ నిన్న చెన్నై నుంచి హైద్రాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన తన పెట్‌ను సైతం తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నా బేబీ గుచ్చి వరలక్ష్మీ మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కాడు. ఎయిర్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు. వాడితో కలిసి ఇలా ప్రయాణం చేసేందుకు సులభమైన పద్దతిని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్. చెన్నై, హైద్రాబాద్, ముంబై ఎయిర్ పోర్ట్ అథారిటీలకు థ్యాంక్స్. అంతే కాకుండా హోటల్‌తో తనతో పాటు తన పెట్‌ను కూడా ఉంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినందుకు ఓక్ వుడ్ రెసిడెన్సీకి థ్యాంక్స్. మిగతా స్టార్ హోటల్‌లు ఇలా అంగీకరించలేదు. దానికి ఎంతో నిరాశచెందాను. ఒక్క హైద్రాబాద్ హోటల్స్‌లోనే ఇలా పర్మిషన్ ఇవ్వడం లేదు. మిగతా అన్ని చోట్లా పెట్స్‌ను తెచ్చుకునేందుకు అంగీకరిస్తున్నాయి. పెట్స్ అంటే మాకు బిడ్డలతో సమానం. మొత్తానికి నా బేబీ ఇలా విమానంలో వచ్చేసింది. ఎంతో సంతోషంగా ఉన్నాడు. గుచ్చికి హెల్ప్ చేసిన రీటాకు ఎంతో థ్యాంక్స్’ అని వరలక్ష్మీ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jIMnpw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...