Tuesday, 13 July 2021

అలా గర్భం దాల్చిన మహేశ్ హీరోయిన్.. అసలు కారణం తెలిస్తే..

‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ.. . తొలి సినిమాతోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ అనే సినిమాలో నటించింది ఈ పొడుగు కాళ్ల సుందరి కానీ.. తెలుగులో చేసి ఈ రెండు సినిమాలో ఆమె నిరాశే మిగిల్చాయి. దీంతో ఆమె తన మకాంని హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడ ఆమెకు మంచి అవకాశాలు లభించాయి. స్టార్ హీరోలతో కూడా నటించే ఛాన్స్ లభించింది. దీంతో టాలీవుడ్‌కి పూర్తిగా స్వస్తి చెప్పి.. బాలీవుడ్‌కే పరిమితం అయ్యింది ఈ భామ. అక్కడే వరుసగా సినిమాలు చూస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘’ అనే సినిమాలో నటిస్తోంది. రూ.20 లక్షల కోసం అమెరికా నుంచి వచ్చిన దంపతులకు బిడ్డను ఇచ్చేందుకు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే తల్లి పాత్రలో కృతి ఈ సినిమాలో నటిస్తోంది. అటు కామెడీ, ఇటు సెంటిమెంట్ రెండిటిని సమానంగా చూపిస్తూ.. ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఎలా విడుదల చేయాలా అని ఎప్పటి నుంచో కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నె‌ట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమా ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ‘తల్లి బిడ్డలకంటే పవిత్రమైన ప్రేమ మరొకటి లేదు’ అనే డైలాగ్‌తో ప్రారంభం అయ్యే ఈ డైలాగ్.. ఆ తర్వాత సరోగసీ ద్వారా కృతి గర్భం దాల్చడం.. అందుకు అమెరికాకు చెందిన దంపతులు ఆమెకు రూ.20 లక్షలు ఇస్తామని అంగీకరించడం.. ఆ తర్వాత ఆ దంపతులు మాకు బేబీ అవసరం లేదు అని చెప్పడం.. కానీ, ఇంతకాలం తన గర్భంలో దాచుకున్న బిడ్డను చంపుకోలేక కృతి ఆ ప్రాణానికి జన్మనివ్వడం ఈ ట్రైలర్‌లో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసిన కృతిని వీక్షకులు మెచ్చుకుంటున్నారు. a


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yRbnyZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...