Wednesday, 28 July 2021

రోడ్ సైడ్ ధాబాలో అసిస్టెంట్లతో అలా.. జగ్గూ భాయ్ సింప్లిసిటీకి అంతా ఫిదా!!

ఇప్పుడు ఎంత బిజీ ఆర్టిస్ట్ అన్నది అందరికీ తెలిసిందే. సౌత్ మొత్తంలోనూ జగపతి బాబు హవా నడుస్తోంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలకు మన జగ్గూ భాయ్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అయితే మధ్యలో కాస్త వేగం తగ్గించారు. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ వచ్చారు. కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి జగపతి బాబుకు ఆఫర్లు వస్తున్నాయి. హీరోగా ఉన్న సమయంలో కంటే ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సమయంలో సంపాదించిన దానికంటే ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నానని జగపతి బాబు కూడా అన్నారు. సోషల్ మీడియాలో జగపతి బాబు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక సమస్యల మీదా స్పందిస్తుంటారు. ఆ మధ్య ఆనందయ్య మందు విషయంలోనూ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఆనందయ్య మందును తాను నమ్ముతున్నానని కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పారు. అలా జగపతి బాబు ప్రతీ విషయంలోనూ తన నిర్ణయాన్ని ముక్కు సూటిగా చెబుతుంటారు. కులం పేరును ఎక్కడా కూడా చెప్పరు. ఆ తోకలను ఎప్పుడూ కూడా తగిలించుకోరు. ఎప్పుడూ ఓ సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. తనదగ్గర పని చేసే వాళ్లను కూడా చిన్నచూపు చూడరు. అలాంటి జగపతి బాబు తాజాగా రోడ్ సైడ్ ధాభాలో కూర్చుని తిన్నారు. అది కూడా తన అసిస్టెంట్లతో పాటే ఆ చిన్న ధాభాలో ఆరగించేశారు. చాలా రోజుల తరువాత ఇలా తిన్నామని జగపతి బాబు చెప్పుకొచ్చారు. జగపతి బాబు చెప్పిన ఈ విషయం, షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలా పబ్లిక్‌గా తింటుంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా? ఎక్కడ ఉన్నారు? ఎంతో సింపిస్లిటీని మెయింటైన్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l6AOcy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...