Saturday, 24 July 2021

ఆ సినిమా చూశాక.. అతనితో కలిసి నటించాలని అనిపించింది: ప్రిమాంక జవల్కర్

‘ట్యాక్సివాలా’... ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ప్రియాంక జవల్కర్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. తాజాగా కొత్త సినిమా ‘తిమ్మరసు’ సంబంధించి వివరాలు ఆమె ప్రేక్షకులకు పంచుకుంది. హీరోగా ఆమె ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ‘ఉమమహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో సత్యదేవ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ సినిమాలో తన నటన చూసి ఈ సినిమాను ఒప్పుకున్నాను అని ప్రియాంక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చూశాక సత్యదేవ్‌తో కచ్చితంగా కలిసి పనిచేయాలనుకున్నా. అదే సమయంలో ‘’ కథ నా దగ్గరకొచ్చింది. సత్య చేస్తున్నాడని తెలిశాక కథ వినకుండానే ఓకే చెప్పేశా. చిత్రీకరణకు ముందు పూర్తి స్క్రిప్ట్‌ విన్నాక.. నా ఎంపిక సరైనదే అనిపించింది. ఇదొక పరిశోధనాత్మక థ్రిల్లర్‌. నేను.. సత్య.. లాయర్లుగా కనిపిస్తాం. మేమిద్దరం కలిసి ఓ కేసు ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాం. ఆ కేసేంటి? దాన్ని ఛేదించే క్రమంలో మాకెదురైన ఇబ్బందులేంటి? ఆ కేసు మేం గెలిచామా.. లేదా? అన్నది చిత్ర కథాంశం. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’ అని ప్రియాంక తెలిపారు..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iG7VAZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...