Sunday, 11 July 2021

పుష్పపై మరో ఆసక్తికర అప్‌డేట్.. హిందీలో రీమేక్ హక్కులు కొన్న స్టార్ నిర్మాత

ఐకాన్ స్టార్ '' సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊహించినదాని కంటే ఎక్కువగా ఈ సినిమా టీజర్‌కు అద్భుమైన స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో వ్యూవ్స్, లైక్స్ సాధించింది ఈ సినిమా టీజర్. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే ల్యే’ అనే డైలాగ్ టీజర్ విడుదలైన రోజు నుంచి ట్రెండింగ్‌లోనే ఉంటోంది. సెన్సేషనల్ దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక జబర్ధస్త్ బ్యూటీ అనసూయ, కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుకావడంతో షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా హిందీ హక్కులను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కొనుగోలు చేశారట. ఆయన బ్యానర్ ‘ధర్మ ప్రొడక్షన్స్‌’పై ఈ సినిమాని బాలీవుడ్‌లో కరణ్ విడుదల చేయనున్నారు. అంతేకాక.. ఉత్తర భారతదేశానికి సంబంధించి సినిమా మార్కెటింగ్‌ కూడా కరణ్ చేయనున్నారు. దీంతో ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VzYhbn
v

No comments:

Post a Comment