Thursday, 8 July 2021

హీరోగా బండ్ల గణేష్.. అంతా సెట్ చేసిన కమెడియన్..! తెరపైకి క్రేజీ అప్‌డేట్

తెలుగు సినీ పరిశ్రమలో అంటే ఓ సంచలనం. వెండితెరపై కమెడియన్‌గా, తెర వెనుక నిలబడి అంతా నడిపించే నిర్మాతగా సత్తా చాటిన ఆయనలో ఓ స్పెషల్ క్వాలిటీ ఉంది. అదే ముక్కుసూటితనం. పవన్ కళ్యాణ్ వీరాభిమానిని, పవన్ నా దేవుడు అని చెప్పుకునే బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి బయటకొచ్చారు. 7'O క్లాక్ బ్లేడ్ డైలాగ్‌తో అప్పట్లో నానా హంగామా సృష్టించారు బండ్ల గణేష్. దాంతో రాజకీయపరమైన స్థిరత్వం రాలేదు గానీ రెట్టింపు పాపులారిటీ మాత్రం వచ్చింది. అదే పాపులారిటీతో ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సినీ ఇండీస్ట్రీనే నమ్ముకుంటూ ముందుకెళ్తున్నారు బండ్ల గణేష్. తనకు ఏ రాజకీయ పార్టీతో, అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదని కన్ఫర్మ్ చేసిన ఆయన.. మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ- ఎంట్రీ ఇచ్చి, నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఆయనకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు తెరపై కమెడియన్‌గా అలరించిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. ఓ కొత్త దర్శకుడు తన కథతో బండ్ల గణేష్‌ని మెప్పించారని, దీంతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. తన ఇమేజ్‌కి తగ్గ స్టోరీ కావడంతో బండ్ల గణేష్ ఆసక్తి చూపారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ రానుందనే సమాచారాలు వైరల్ అవుతున్నాయి. సో.. చూడాలి మరి దీనిపై బండ్ల గణేష్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dUVhMS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...