Sunday, 25 July 2021

మెగా హీరోతో తమన్నా చిందులు.. భారీ రేంజ్ రెమ్మ్యూనరేషన్! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్

కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ యమ స్పీడులో ఉంది సీనియర్ హీరోయిన్ . పాత్ర ఏదైనా సరే దాని ప్రాముఖ్యత తెలుసుకొని వరుస సినిమాలకు కమిటవుతున్న ఆమె.. అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ యూత్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. 'దోచేయ్' అంటూ కేజీఎఫ్ హీరో యష్‌తో చిందులేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘డ్యాంగ్ డ్యాంగ్‌’ అంటూ సూప‌ర్‌ స్టార్ మహేష్ బాబుతో పార్టీ సాంగ్ చేసి ఊపేసింది. దీంతో తమన్నాకు సినిమా అవకాశాలతో పాటు ఐటెం సాంగ్ చేసే ఆఫర్స్ కూడా వెల్లువెత్తుతున్నాయట. తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించడం వల్ల తమ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న '' మూవీ కోసం ఆమెను సంప్రదించగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ ఒక్క సాంగ్ కోసం రెమ్మ్యూనరేషన్ కూడా ఓ రేంజ్‌లో ఆఫర్ చేశారట మేకర్స్. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఈ పాటలో తమన్నా హాట్ ట్రీట్ పిచ్చిక్కించనుందని తెలుస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ 'గని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా రాబోతున్న ఈ 'గని' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fcssfJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...