Sunday, 4 July 2021

సడెన్‌గా రాజకీయాల్లోకి రామ్ చరణ్! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్.. ఇదే బిగ్ ట్విస్ట్

మెగా ఫ్యామిలీకి రాజకీయాలతో ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. మెగాస్టార్ చిరంజీవి తన సొంత పార్టీతో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా యూ టర్న్ తీసుకోగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముందడుగేసి రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అప్పటినుంచి మెగా ఫ్యామిలీ రాజకీయాలంటే జనాల్లో అదో క్రేజ్. సరిగ్గా ఇదే పాయింట్ తీసుకొని తన సినిమాను ప్లాన్ చేస్తున్నారట పాన్ ఇండియా డైరెక్టర్ . శంకర్- కాంబోలో ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ఇప్పటినుంచే ప్లాన్స్ చేస్తున్నారట శంకర్. భారీతనం ఉట్టిపడేలా, అదేవిధంగా ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ సినిమా కావాలని ఆయన బలంగా ఫిక్సయ్యారట. ఈ మేరకు కథను మరింత సానబడుతున్నారట శంకర్. ఈ నేపథ్యంలో కథలో ఆసక్తికర పాయింట్ ఇదే అంటూ ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. సోషల్‌ మెసేజ్‌ ఉన్న కాన్సెప్ట్‌‌కి శంకర్‌ శైలిలో మెరుగులు దిద్దుతున్నారట. ఇందులో రామ్‌చరణ్‌ పోలీస్‌ వృత్తి నుంచి సడెన్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వ్యవస్థను సంస్కరించే వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇదే ఈ మూవీలో బిగ్ ట్విస్ట్ అంటున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో దిల్ రాజు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అక్టోబర్‌ నెలలో సెట్స్‌ మీదకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆరు నెలల్లోనే షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని శంకర్ ఫిక్సయినట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hfbRsQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...