Thursday, 15 July 2021

దానికి నేను బానిసనయ్యాను.. అనుపమ కామెంట్స్ వైరల్

పరమేశ్వరణ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తెరపై అనుపమ కనిపించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు. కేరళ బ్యూటీ అనుపమ సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతుంటారు. అయితే ఈ మధ్య అనుపమకు సరైన హిట్ మాత్రం రావడం లేదు. హీరో రామ్‌తో కలిసి చేసిన హలో గురు ప్రేమ కోసమే వర్కవుట్ కాలేదు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన రాక్షసుడు సినిమాతో హిట్ దక్కింది. కానీ క్రెడిట్ మాత్రం అంతగా రాలేదు. అలా అనుపమ సినీ కెరీర్ ఇప్పుడు కాస్త స్లోగా ఉంది. సినిమాలు అంతగా హిట్ కాకపోయినా కూడా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. నిఖిల్ హీరోగా వస్తోన్న 18పేజీలు, రౌడీ బాయ్స్ అనే కొత్త సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు అనుపమ కొత్త ఆటకు బానిసయ్యారట. ఈ మేరకు ఆమె చెప్పిన మాటలు, ఆడిన ఆటలు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లీష్ పదాలను కనుక్కునే ఈ ఆటను ఈ మధ్య సెలెబ్రిటీలు ఎక్కువగానే ఆడుతున్నారు. గిబ్బరిష్ అనే ఈ ఆటలో కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టవచ్చు. ఇక నిన్న అనుపమ ఈ ఆటలో మునిగి తేలారు. మొత్తానికి ఆ ఆటకు బానిసను అయ్యానంటూ చెప్పుకొచ్చారు. ఇదే చివరిది అంటూ ఇంకా ఆడుకుంటూనే వెళ్లారు. అలా అనుపమ చేసిన అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక అనుపమా పాడిన పాటలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3isxTbd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...