Monday, 19 July 2021

పెళ్లైనా కూడా ప్రేమ తగ్గలేదా?.. ఆ హీరోయిన్‌ ఇష్టమంటోన్న మెగా హీరో!

మెగా హీరోలు సోషల్ మీడియాలో ఓ మోస్తరుగా యాక్టివ్‌గా ఉంటారు. మరీ ఎక్కువగా స్పందించరు. అలా అని మొత్తానికే సైలెంట్‌గా ఉండిపోరు. అప్పుడప్పుడు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వేసుకునే సెటైర్లు, పాత ఫోటోలను బయటపెట్టి వారి పరువే వారే తీసుకునే తీరు అందరినీ నవ్విస్తుంటుంది. అలా సుప్రీమ్ హీరో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఫన్ క్రియేట్ చేస్తుంటారు. అయితే మొదటి సారిగా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. ఈ క్రమంలో అనేక విషయాలపై స్పందించారు. మొన్నీ మధ్య సాయి ధరమ్ తేజ్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్‌ను అనేక ప్రశ్నలను సంధించారు. అయితే చాలా మంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విశేషాలను అడిగారు. తల్లిదండ్రులు, మామయ్యలు, మెగా కజిన్స్‌కు సంబంధించిన విశేషాలను సాయి ధరమ్ తేజ్ చేత చెప్పించారు. అయితే ఇందులో మాత్రం ఓ ఆసక్తికరమైన ప్రశ్న సాయి ధరమ్ తేజ్‌కు ఎదురైంది. మీకు టాలీవుడ్‌లో ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని అడిగేశాడు. దానికి సాయి ధరమ్ తేజ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎప్పటికీ తనకు అంటేనే ఇష్టమని అన్నారు. గతంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ప్రమోషన్స్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే సమంతకు పెళ్లి అయినా కూడా సాయి ధరమ్ తేజ్ తన ఇష్టాన్ని మాత్రం మార్చుకోలేదు. ఇంకా సమంత అంటేనే ఇష్టమని చెప్పేశారు. సాధారణ ప్రేక్షకులకు ఎలాగూ సెలెబ్రిటీలు అంటే ఇష్టముంటారు. కానీ సెలెబ్రిటీల్లోనూ సెలెబ్రిటీలకు ఇలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zdxlMV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...