Saturday, 17 July 2021

అలా భయపెట్టించిన వ్యక్తి!.. రష్యా వీధుల్లో పరుగెత్తిన శ్రియ

హీరోయిన్ శ్రియ, ఆమె భర్త సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో నిత్యం హల్చల్ చేస్తుంటారు. ఇక ఈ ఇద్దరి సరసాలకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. గత ఐదారు రోజులుగా శ్రియ, ఆమె భర్త బోటు షికార్లు ట్రెండ్ అవుతున్నాయి. ఏకంగా ఆమె ఎద భాగాన్ని ముద్దాడుతూ ఆండ్రూ చేసిన చిలిపి పనులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు రష్యా వీధుల్లో ఎంచక్కా తిరుగుతోంది. తాజాగా ఆండ్రూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బోటులో షికార్లు చేసిన శ్రియా, ఆండ్రూలు చేసిన రచ్చ ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. తాజాగా శ్రియా బోటులో ప్రయాణిస్తూ ఉంటే.. ఆండ్రూ మాత్రం సపరేట్ బోటులో విన్యాసాలు చేశారు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన ఈ జంట రష్యా వీధుల్లో చక్కర్లు కొట్టారు. అక్కడ ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఆ ఘటనతో శ్రియా ఒక్కసారి ఉలిక్కి పడి పారిపోయారు. ఈ మేరకు శ్రియా భర్త ఆండ్రూ ఓ వీడియోను షేర్ చేశారు. రష్యా వీధుల్లో శ్రియా నడుస్తూ ఉంటే.. అక్కడికి ఓ వ్యక్తి వచ్చారు. మ్యాజిక్ చేస్తున్నట్టుగా.. ఆ వ్యక్తి తల లేకుండా మాట్లాడుతూ శ్రియా వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇక అలా ఓ వ్యక్తి మొహం లేకుండా తన వద్దకు వస్తుండటంతో శ్రియా భయపడ్డారు. అక్కడి నుంచి పారిపోయారు. ఈ తతంగాన్ని అంతా కూడా ఆండ్రూ దగ్గరుండి మరీ తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rivV0J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...