Monday, 12 July 2021

‘అతనిలా ఎవరు ప్రేమిస్తారు.. ఇదిగో టీ తీసుకోండి’.. కాజల్ ఆసక్తికర్ పోస్ట్..

‘పంచదార బొమ్మ.. బొమ్మ’ ఈ పాట వింటే అందరికి ఎవరు గుర్తొస్తారు.. నిర్మొహమాటంగా ఆ పంచదార బొమ్మ కాజల్ అగర్వాలే. అంతలా తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపించింది ఈ ముద్దుగుమ్మ. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కాజల్.. ఆ తర్వాత ‘చందమామ’, ‘మగధీర’ తదితర చిత్రాలతో భారీ సక్సెస్‌ను అందుకుంది. అంతేకాదు.. దక్షిణాదిన అందకు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని సంపాదించుకుంది. నిజానికి కాజల్‌తో కలిసి నటించాలని కొందరు యువ హీరోలు ఊర్రూతలూగుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్‌డౌన్ ప్రభావంతో సినిమా థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. నేరుగా అన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు ఓటీటీల్లో సినిమాలు చూసే సౌకర్యం ఎంతో పెరిగిపోయింది. కాజల్ కూడా ఈ ఫ్లాట్‌ఫామ్‌పై దృష్టి కేంద్రీకరించింది. కొంతకాలం క్రితం ‘లైవ్‌ టెలికాస్ట్’ అనే వెబ్‌సిరీస్‌తో కాజల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ వంటి సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్‌సిరీస్‌లు కూడా గట్టిగానే ప్లాన్ చేస్తోంది కాజల్. ప్రస్తుతం కాజల్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ఉమా’ అనే వెబ్‌సిరీస్‌తో ఆమె నేరుగా హిందీ ప్రేక్షకులకు పరిచయం కానుంది. బెంగాలీ భాషలో రూపొందుతున్న ఈ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించింది. ఇందుకు సంబంధించి కలకత్తా భామలా కాజల్ ఓ పోస్ట్‌ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘ఎంతో వేడితో ఉండే ఈ ఛాయ్‌ని మన కౌగిలిలోకి తీసుకొనేందుకు ఎంత ఇష్టపడతామో.. అతని ప్రేమ కూడా అలాంటిదే’ అంటూ కాజల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e9eqe6
v

No comments:

Post a Comment