Sunday, 18 July 2021

‘అప్పట్లో నా జట్టు ఇలా ఉందేంటి’.. హీరో వరుణ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా ప్రిన్స్ . తొలి సినిమా ‘ముకుందా’ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆ తర్వాత సినిమాల్లో విలక్షణమైన నటనను ప్రదర్శిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్‌గా ‘గద్దలకొండ గణేశ్’, ‘ఎఫ్ 2’ సినిమాలతో అతను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక సోషల్‌మీడియా విషయానికొస్తే.. వరుణ్ అప్పుడప్పుడు అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలు కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే కానీ అతను పోస్టులు పెట్టడు. తాజాగా అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. సాధారణంగా ఎవరికైనా సరే.. కొన్ని సంవత్సరాల క్రితం తాము దిగిన ఫోటో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి అప్పుడు నేను అలా ఉన్నానా.. అప్పుడే బాగున్నాను.. లేదా ఇంత భయంకరంగా ఉన్నాను ఏంటీ అంటూ అనుకుంటారు. ఇది ప్రతీ ఒక్కరి విషయంలోనూ జరిగేదే. ఇక సోషల్‌మీడియా వాడకంలోకి వచ్చిన తర్వాత మెమోరీస్ పేరుతో మనం గతంలో పోస్ట్ చేసిన పిక్స్‌ని అదే మనకి మళ్లీ చూపిస్తుంది. ఈ పిక్స్ చూసినప్పుడల్లా పైన చెప్పిన ఫీలింగ్స్ కలగడం సర్వసాధారణమే. అయితే వరుణ్ తేజ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం తాను దిగిన ఫోటోని అతను వేదికగా షేర్ చేశాడు. ఇందులో అతని జట్టు ముళ్లులులా పైకి లేచి ఉంది. ‘అరే! నా జట్టుకు ఏం అయింది’ అంటూ వరుణ్ దీనికి క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు వరుణ్‌ని డిఫరెంట్ లుక్‌లో చూసి ఫిదా అవుతున్నారు. లవ్ సింబల్స్‌తో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘ఘని’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు వరుణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hMSO9v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...