వారసత్వంగా సినిమాల్లోకి వస్తున్న హీరోల వల్ల దేశానికి ఏం ఉపయోగం అని ప్రశ్నించారు సీనియర్ నటుడు . సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన నెపోటిజమ్‌పై ఆయన మాట్లాడుతూ.. ‘అన్నిరంగాల మాదిరిగానే సినిమాల్లో కూడా వారసత్వం ఉంది. అదేం తప్పుకాదు కానీ.. రాను రాను ఎలా తయారైందంటే.. డబ్బులు ఉన్నాయి కదా కోట్లు కోట్లు అని.. చదువులు మానిపించేసి.. సంపాదించుకుంటాడులే అని సినిమాల్లోకి తోసేస్తున్నారు. ఇలాంటిది వద్దని అంటున్నా. పెద్ద హీరోగారి అబ్బాయి.. బ్రహ్మాండంగా చదువుకోగలడు.. బోలెడు డబ్బులు కూడా ఉన్నాయి. చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడాలి కానీ.. దేశం మీద ఆధారపడి దేశంపైనే డబ్బులు తీసుకుంటే నీ తెలివితేటలు దేశానికి ఏం ఉపయోగపడ్డట్టు. నువ్వేం చేశావ్.. నువ్ దేశానికి ఏం చేశావ్ అని నన్ను అడగొచ్చు.. ఎస్ నేను ఉపయోగపడుతున్నా.. నా నటన వల్ల ప్రేక్షకుడు ఆనందపడుతున్నాడు. మిగతావాళ్లు అలా కాదు కదా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కోటా శ్రీనివాసరావు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SZSBpW
v
No comments:
Post a Comment